వందలకొద్దీ పాములను చుట్టచుట్టి సంచిలో వేసుకొచ్చాడు.. ఇతడి ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ABN , First Publish Date - 2022-02-04T01:00:29+05:30 IST

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదుగానీ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతంలోకి ఓ వ్యక్తి పెద్ద సంచిని మోసుకుంటూ వస్తాడు. అందులో ఏవైనా వస్తువులు ఉంటాయేమో అని అంతా అనుకుంటారు. కిందకు దించి..

వందలకొద్దీ పాములను చుట్టచుట్టి సంచిలో వేసుకొచ్చాడు.. ఇతడి ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

పామును దూరంగా చూస్తేనే వళ్లంతా జలదరిస్తుంది. ఒకవేళ ఏ పామో సమీపానికి వస్తే గుండె ఆగిపోయేంత పనవుతుంది. పాములు పట్టే వారు ఏమాత్రం భయం లేకుండా సునాయాసంగా వాటిని పట్టుకోవడం చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి.. అంతకుమించి సాహసం చేశాడు. వందల సంఖ్యలో పాములను చుట్టచుట్టి సంచిలో వేసుకొచ్చాడు. ఇతడి ధైర్యాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదుగానీ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతంలోకి ఓ వ్యక్తి పెద్ద సంచిని మోసుకుంటూ వస్తాడు. అందులో ఏవైనా వస్తువులు ఉంటాయేమో అని అంతా అనుకుంటారు. కిందకు దించి సంచిని విదిలించగానే షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. వందల సంఖ్యలో పాములన్నీ చుట్టలుచుట్టలుగా బయటికి వస్తాయి. ఒక్క పాముతోనే సమస్య అనుకుంటే అన్ని పాములను మోసుకురావడమే కాకుండా.. వాటి మీద చేతులు పెట్టి మరీ అడవిలోకి పంపిస్తాడు.

దర్జాగా వచ్చి, తుపాకీ చూపించి.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా..


దాదాపు 300పాములన్నీ ఒక్కసారిగా అడవిలోకి వెళ్లిపోతాయి. ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి హానీ చేయకపోవడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అవి పాముల్లా కాకుండా నూడుల్స్ మాదిరి కనిపిస్తున్నాయేమో అని కొందరు చమత్కరిస్తుండగా.. పాములను అడవిలోకి వదిలి మంచి పని చేశాడంటూ మరికొందరు అభినందిస్తున్నారు.

అంతా చూస్తుండగా.. చిన్నారిని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి నెట్టేసింది.. చివరికి ఏమైందో మీరే చూడండి..



Updated Date - 2022-02-04T01:00:29+05:30 IST