విడాకులు తీసుకున్న మ‌హిళ‌లే అత‌ని టార్గెట్.. వారితో అత‌ను ఏం చేసేవాడంటే..

ABN , First Publish Date - 2022-01-02T10:12:37+05:30 IST

విడాకులు తీసుకున్న ప్ర‌త్యూష(పేరు మార్చ‌బ‌డిన‌ది) మ‌ళ్లీ వివాహం చేసుకుందామ‌ని భావించి మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ ద్వారా పంక‌జ్ శ‌ర్మ అనే వ్య‌క్తిని క‌లిసింది. పంక‌జ్ త‌నను ఒక ఎన్నారైగా ప‌రిచ‌యం చేసుకున్నాడు. త‌నకు విదేశాల వీసా ప్రాసెసింగ్ క‌న్సెల్టెన్సీ ఉంద‌ని.. ఇప్ప‌టివ‌రకు 50కిపైగా...

విడాకులు తీసుకున్న మ‌హిళ‌లే అత‌ని టార్గెట్.. వారితో అత‌ను ఏం చేసేవాడంటే..

విడాకులు తీసుకున్న ప్ర‌త్యూష(పేరు మార్చ‌బ‌డిన‌ది) మ‌ళ్లీ వివాహం చేసుకుందామ‌ని భావించి మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ ద్వారా పంక‌జ్ శ‌ర్మ అనే వ్య‌క్తిని క‌లిసింది. పంక‌జ్ త‌నను ఒక ఎన్నారైగా ప‌రిచ‌యం చేసుకున్నాడు. త‌నకు విదేశాల వీసా ప్రాసెసింగ్ క‌న్సెల్టెన్సీ ఉంద‌ని.. ఇప్ప‌టివ‌రకు 50కిపైగా మందిని కెనెడా పంపించాన‌ని పంక‌జ్ చెప్పాడు. దీంతో ప్ర‌త్యూష పంక‌జ్‌తో స్నేహం చేసింది. 


ప్ర‌త్యూష‌కు కెనెడా వీసా ఇప్పించి ఆమెకు కెనెడాలోనే పెళ్లి సంబంధం కూడా చూస్తాన‌ని పంక‌జ్ న‌మ్మ‌బ‌లికాడు. వీసా ప్రాసెసింగ్ కోసం ప్ర‌త్యూష వ‌ద్ద  ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్, పాస్ పోర్ట్, ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్న్స్ తీసుకున్నాడు. కొన్ని రోజుల త‌రువాత వీసా రావ‌డం క‌ష్ట‌మ‌ని కొంచెం ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పాడు. అలా ప్ర‌త్యూష వ‌ద్ద రూ.25 ల‌క్ష‌లు తీసుకున్నాడు. ఆ త‌రువాత పంక‌జ్ మొబైల్ స్విచాఫ్ చేసి మాయమయ్యాడు. దీంతో ప్ర‌త్యూష తాను మోస‌పోయాన‌ని గ్రహించింది. పంక‌జ్ ఫొటో చూపి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 


పంక‌జ్ గురించి ద‌ర్య‌ప్తు చేసిన పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలిశాయి. అత‌నికి ఇప్ప‌టికే మూడు భార్య‌లున్నార‌ని.. కెనెడా వీసాల పేరుతో దాదాపు 50 మంది విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌ని మోసం చేశాడ‌ని తేలింది. దీంతో పోలీసులు పంక‌జ్ గురించి పూర్తి స‌మాచారం సేకరించి.. అత‌ని స‌హ‌చ‌రుడు కుల్దీప్‌ని అరెస్టు చేశారు. కుల్దీప్‌ని ప్ర‌శ్నించ‌గా.. అత‌ను పంక‌జ్ ఆచూకీ తెలిపాడు. దీంతో పోలీసులు పంక‌జ్‌ని అరెస్టు చేశారు.


పాస్‌పోర్టుల‌పై న‌కిలీ కెనెడా వీసాల‌ను స్టాంప్ చేయ‌డంలో కుల్దీప్  నిపుణుడు. కుల్దీప్ స‌హాయంతో పంక‌జ్ విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు కెనెడా వీసా పేరుతో మోసం చేసి కోట్లు కాజేశాడు.

Updated Date - 2022-01-02T10:12:37+05:30 IST