Viral Video: రెండో అంతస్తు నుంచి బిడ్డను కిందకు జారవిడిచిన తండ్రి! మరో మార్గం లేక తీసుకున్న నిర్ణయం.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-13T01:10:40+05:30 IST

ప్రమాదాలు మనకు చెప్పి రావు.. అటువంటి సమయాల్లో చావుబతుకుల మధ్య కొన్ని సెకన్ల తేడా మాత్రమే ఉంటుంది. క్షణాల వ్యవధిలో భయంకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బతకడం కోసం చావుతో చెలగాటం ఆడటం లాంటింది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన ఓ తండ్రి ఇటీవల సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.

Viral Video:  రెండో అంతస్తు నుంచి బిడ్డను కిందకు జారవిడిచిన తండ్రి! మరో మార్గం లేక తీసుకున్న నిర్ణయం.. చివరికి ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రమాదాలు మనకు చెప్పి రావు.. అటువంటి సమయాల్లో చావుబతుకుల మధ్య కొన్ని సెకన్ల తేడా మాత్రమే ఉంటుంది. క్షణాల వ్యవధిలో భయంకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బతకడం కోసం చావుతో చెలగాటం ఆడటం లాంటింది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన ఓ తండ్రి ఇటీవల సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. రెండో అంతస్తులోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. గడప దాటి మెట్ల ద్వారా కిందకు చేరే అవకాశమే లేకపోయింది. ఇంట్లోనేమో మూడేళ్ల వయసున్న బాలుడు. ఇల్లంతా దట్టమైన పొగకమ్ముకోవడం ప్రారంభమైంది.. క్షణక్షణానికీ దగ్గరవుతున్న మరణం.


అయితే.. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ ఫైటర్లు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని క్షణకాలంలోనే అంచనా వేశారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే.. అతడిని రెండో అంతస్తు నుంచి కింద ఉన్న సిబ్బంది చేతిలో పడేలా జారవిడవాలి. ఇదొక్కటే వారి ముందున్న మార్గం. ఎంతో ప్రమాదకరమైన నిర్ణయం. వారి అంచనా ఏమాత్రం తప్పినా.. బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది..బిడ్డను కిటికీ లోంచి కిందకు వదిలేయమని సూచించారు. మరో ఆలోచన లేకుండా ఆ తండ్రి.. వారు చెప్పిందే  చేశాడు. అదృష్టం వారి వెంటే ఉండటంతో ఆ అంచనాలు తప్పలేదు. ఫైర్ ఫైటర్లు ఆ చిన్నారిని రక్షించగలిగారు. ఆ తరువాత తండ్రి కూడా కిటికీ లోంచి దూకేయగా అతడిని కూడా ఫైర్ ఫైటర్లు కాపాడారు. అయితే.. బిడ్డను కిందకు జారవిడుస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.



Updated Date - 2022-03-13T01:10:40+05:30 IST