ఒంటి చేత్తో వైకల్యాన్ని జయించాడు!

ABN , First Publish Date - 2021-05-18T06:55:00+05:30 IST

ఆయన ఒక రైతు. రోడ్డు ప్రమాదంలో కుడి చేయి అచేతనం గా మారింది. అయిన ప్పటికీ కుంగిపోలేదు.

ఒంటి చేత్తో వైకల్యాన్ని జయించాడు!
ఒంటిచేత్తో ట్రాక్టర్‌ను నడుపుతున్న నర్సింహారెడ్డి

రోడ్డు ప్రమాదంలో కుడిచేయిని కోల్పోయిన రైతు

ట్రాక్టర్‌తో పొలం దున్నకంలో సిద్ధహస్తుడు 

మర్రిపూడి, మే 17 : ఆయన ఒక రైతు. రోడ్డు ప్రమాదంలో కుడి చేయి అచేతనం గా మారింది. అయిన ప్పటికీ కుంగిపోలేదు. తాను ఎంచుకున్న  మార్గంలో నైపుణ్యాన్ని ప్రదర్శించి వైకల్యాన్ని జయించాడు. మండ లంలోని పొట్టిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన మూలే వెంకటనర్సింహారెడ్డి ఓ మధ్య తరగతి రైతు. 10సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుడిచేయి పూర్తిగా దెబ్బతింది. అది పని చేయనప్పటికీ వెంకటనర్సింహారెడ్డి  మనోనిబ్బరంతో ముందుకు సాగారు. వ్యవసాయంపై మక్కువతో ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. ఒంటిచేత్తో ట్రాక్టర్‌ను నడపడంలో ప్రావీణ్యం  సంపాదించాడు. వ్యవసాయ పనుల్లో ప్రధానమై దుక్కులు దున్నడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. నర్సింహారెడ్డి సాలు వేస్తే గీత గీసినట్లే కోటేరులాగా ఉంటుందని పేరు సంపాదించుకున్నాడు. దీంతో అతనితో దుక్కి దున్నించుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఒంటి చేత్తో వైకల్యాన్ని జయించిన నర్సింహారెడ్డిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2021-05-18T06:55:00+05:30 IST