నిత్య యవ్వనం కోసం అతను ఏం చేస్తాడో తెలిస్తే ఛీ ఛీ అంటారు!

ABN , First Publish Date - 2022-06-19T16:32:16+05:30 IST

ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ యవ్వనంగా కనిపించాలని తపన పడుతుంటారు.

నిత్య యవ్వనం కోసం అతను ఏం చేస్తాడో తెలిస్తే ఛీ ఛీ అంటారు!

ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ యవ్వనంగా కనిపించాలని తపన పడుతుంటారు. ఇందుకోసం కొందరు ఆయుర్వేద విధానాలను అవలంబిస్తుంటారు. మరికొందరు తమను తాము యవ్వనంగా మార్చుకోవడానికి సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. అయితే యవ్వనంగా కనిపించేందుకు ఒక వ్యక్తి తన మూత్రాన్ని తానే తాగుతాడని తెలిస్తే ఛీ ఛీ అని అంటారు. ఆ వివరాలు ఇఫ్పుడు తెలుసుకుందాం. ఇంగ్లండ్‌కు చెందిన ఈ 34 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్లుగా యవ్వనంగా కనిపించేందుకు రోజూ తన మూత్రాన్ని తానే తాగుతుంటాడు. హ్యారీ మటాడిన్ అనే ఈ వ్యక్తి తన మూత్రాన్ని తాగడం వల్ల డిప్రెషన్‌ను అధిగమించగలిగానని చెప్పాడు.


న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం హ్యారీ 2016లో తన మానసిక సమస్యలనును పరిష్కరించుకునేందుకు మూత్రాన్ని తాగడం ప్రారంభించాడు. ‘యూరిన్ థెరపీ’ తనకు ప్రశాంతతను అందించడంలో సహాయపడిందని చెప్పాడు. దీని కారణంగానే మెదడు మెరుగ్గా పని చేస్తున్నదని,  వయస్సు కూడా తక్కువగా కనిపిస్తుందని తెలిపాడు. హ్యారీ రోజుకు 200 మిల్లీ లీటర్ల మూత్రం తాగుతాడు. హ్యారీ తన మూత్రం  నుంచి వచ్చే వాసన, రుచి ఎంతో ఇష్టమని చెప్పాడు. మూత్రం తనను యంగ్‌గా మార్చిందని చెప్పాడు.  హ్యారీ తన మూత్రం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దానిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. అయితే హ్యారీ చర్యలను అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2022-06-19T16:32:16+05:30 IST