సోషల్ మీడియా ద్వారా భార్యకు విడాకులిచ్చిన యువకుడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

ABN , First Publish Date - 2022-01-31T05:49:55+05:30 IST

ఒక యువకుడు తన భార్యకు సోషల్ మీడియా ద్వారా విడాకులిచ్చాడు. అతని భార్య తనకు భర్త అన్యాయం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ విడాకులు చెల్లవంటై కోర్టులో కేసు పెట్టింది...

సోషల్ మీడియా ద్వారా భార్యకు విడాకులిచ్చిన యువకుడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

ఒక యువకుడు తన భార్యకు సోషల్ మీడియా ద్వారా విడాకులిచ్చాడు. అతని భార్య తనకు భర్త అన్యాయం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ విడాకులు చెల్లవంటై కోర్టులో కేసు పెట్టింది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. 


వివరాల్లోకి వెళితే..  గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ జిల్లాకు చెందిన సలీం(28) అనే యువకుడు 2019 నవంబర్‌లో రుక్సానా(27, పేరు మార్చబడినది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు.  పెళ్లైన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం రుక్సానాను సలీం తన ఇంట్లో నుంచి బయటికి తోసేసి మూడు సార్లు తలాక్ చెప్పాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రుల ఇంటకి వెళ్లిపోయింది. 


భారతదేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం నిషేధించబడిన విషయం రుక్సానా కుటుంబానికి తెలియదు. కొన్ని రోజుల తరువాత సలీం చెప్పిన మూడు తలాక్ విడాకులు చెల్లవంటూ రుక్సానా కుటుంబ సభ్యులు.. అతనికి చెప్పి భార్యాభర్తలు మళ్లీ కలిసి పోవాలని కోరారు. కానీ సలీం అందుకు అంగీకరించలేదు. తాజాగా.. రుక్సానా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉందని తెలిసి సలీం మళ్లీ ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు ఆమె అకౌంట్‌కు మెసేజ్ పెట్టాడు.


ఆ మెసేజ్‌ని ఆధారంగా చూపుతూ రుక్సానా తన భర్త సలీంపై ట్రిపుల్ తలాక్ చట్ట ప్రకారం కేసు నమోదు చేసింది. పోలీసులు ఈ ట్రిపుల్ తలాక్ కేసులో సలీంను విచారణ చేస్తున్నారు.


Updated Date - 2022-01-31T05:49:55+05:30 IST