మోనాలిసా పెయింటింగ్‌పై దాడి

ABN , First Publish Date - 2022-05-31T10:36:40+05:30 IST

ప్రపంచలోనే అత్యంత ప్రాచుర్యమైన కళాకృతి, పాపులర్‌ పెయింటింగ్‌ అయిన మోనాలిసా ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. ఒక వృద్ధురాలి వేషంలో విగ్గు ధరించి వీల్‌చైర్‌లో వచ్చిన 36 ఏళ్ల యువకుడు పెయింటింగ్‌పై ఓ కేకును విసిరేశాడు. ..

మోనాలిసా పెయింటింగ్‌పై దాడి

ప్రపంచలోనే అత్యంత ప్రాచుర్యమైన కళాకృతి, పాపులర్‌ పెయింటింగ్‌ అయిన మోనాలిసాని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. ఒక వృద్ధురాలి వేషంలో విగ్గు ధరించి వీల్‌చైర్‌లో వచ్చిన 36 ఏళ్ల యువకుడు పెయింటింగ్‌పై ఓ కేకును విసిరేశాడు. 


కానీ, ఆ పెయింటింగ్‌కు రక్షణగా బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ ఉండటంతో ఆ కేకు మోనాలిసాకు తాకలేదు. కళాప్రియులు, సందర్శకులు, సెక్యూరిటీ ఉండగానే ఆ యువకుడు ఈ దాడి చేయడం గమనార్హం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసులు ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


లియోనార్డో డావిన్సీ గీసిన అపురూప కళాఖండమైన మోనలీసా పెయింటింగ్  ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని లావ్రే మ్యూజియంలో సందర్శన చేయవచ్చు.

Updated Date - 2022-05-31T10:36:40+05:30 IST