నీటిలో తేలుతూ వెళ్తున్న మూట.. తెరిచి చూడగా షాక్

ABN , First Publish Date - 2021-03-07T08:50:46+05:30 IST

అమెరికాలో ఓ స్విమ్మర్‌కు 1.5 మిలియన్ డాలర్లు(రూ. 10.97 కోట్లు) విలువ చేసే మూట దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నీటిలో తేలుతూ వెళ్తున్న మూట.. తెరిచి చూడగా షాక్

ఫ్లోరిడా: అమెరికాలో ఓ స్విమ్మర్‌కు 1.5 మిలియన్ డాలర్లు(రూ. 10.97 కోట్లు) విలువ చేసే మూట దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన ఓ స్విమ్మర్ గత గురువారం క్రైగ్ కీ అనే ప్రాంతంలో ఉన్న నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో స్విమ్మర్‌కు ఓ పెద్ద మూట నీటిలో తేలుతూ వెళ్లడం కనిపించింది. ఆ మూటను తీసుకుని స్విమ్మర్ వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అధికారులు ఆ మూటను విప్పగా అందులో 30.8 కేజీల డ్రగ్స్ కనిపించాయి. 30 కేజీల డ్రగ్స్‌ను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ డ్రగ్స్ విలువ 15 లక్షల డాలర్ల(10.97 కోట్లు)కు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆ మూట నీటిలోకి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం ఫ్లోరిడాలోనే ఓ మత్స్యకారుడికి 12 లక్షల డాలర్లు(రూ. 8.78 కోట్లు) విలువ చేసే డ్రగ్స్ దొరికాయి. ఇప్పుడు మరోమారు అదే రాష్ట్రంలో పది కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ దొరకడం విశేషం.

Updated Date - 2021-03-07T08:50:46+05:30 IST