ముంబై ధారావిలో కరోనాతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-04-03T09:55:05+05:30 IST

ఆసియాలో అత్యంత పెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబై ధారావిలో ఒక వ్యక్తి కరోనాతో మరణించాడు. మృతుడికి గత నెల 23న దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో 26న స్థానిక సియాన్‌ ఆస్పత్రిలో...

ముంబై ధారావిలో కరోనాతో ఒకరి మృతి

ముంబై/అమృత్‌సర్‌, ఏప్రిల్‌ 2: ఆసియాలో అత్యంత పెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబై ధారావిలో ఒక వ్యక్తి కరోనాతో మరణించాడు. మృతుడికి గత నెల 23న దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో 26న స్థానిక సియాన్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడే చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందాడు. దీంతో మృతుడి ఇల్లు ఉన్న ప్రాంతాన్ని ‘కంటైన్‌మెంట్‌ జోన్‌గా’ ప్రకటించి, చుట్టుపక్కల లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. స్వర్ణదేవాలయ మాజీ హజూరీ రాగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్‌ సింగ్‌ (62), కరోనాతో గురువారం ఉదయం మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ మృతుల సంఖ్య 5కు చేరింది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీలో ఒక సమ్మేళనానికి హాజరు కావడంతో పాటు ఇతర ప్రాంతాలకూ తిరిగారు. పంజాబ్‌లో ఇప్పటి వరకూ 46 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-03T09:55:05+05:30 IST