తేనెటీగ కుట్టి కస్టడీలో వ్యక్తి మృతి...పోలీస్ స్టేషన్‌కు నిప్పు

ABN , First Publish Date - 2022-03-21T23:49:09+05:30 IST

తేనెటీగలు కుట్టి కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించడంతో స్థానికులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కు..

తేనెటీగ కుట్టి కస్టడీలో వ్యక్తి మృతి...పోలీస్ స్టేషన్‌కు నిప్పు

బెట్టాయ్: తేనెటీగలు కుట్టి కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించడంతో స్థానికులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌లోని వెస్ట్ చంపరాన్ జిల్లా బెట్టాయ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


బెట్టాయ్ పోలీస్ సూపరింటెండెంట్ ఉపేంద్ర నాథ్ వర్మ కథనం ప్రకారం, పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని తేనెకుట్టడంతో అతను కన్నుమూశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మూడు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. హోలీ సందర్భంగా భారీ శబ్దాలతో మ్యూజిక్ ప్లే చేయడంతో ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామని వర్మ తెలిపారు.


కాగా, ఈ ఘటనను అధికార యంత్రాంగం అరాచకంగా రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. బెట్టాయ్‌లో కస్టోడియల్ మృతి దురదృష్టకరమని, గతంలో కూడా పోలీసు కస్టడీలో మరణాలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. పోలీసులు తన మాట కూడా వినడం లేదని అసెంబ్లీ స్పీకరే స్వయంగా చెప్పారని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పాలనా సామర్థ్యం కొరవడిందని అన్నారు.

Updated Date - 2022-03-21T23:49:09+05:30 IST