కరోనా టెస్ట్ రిపోర్టు రాకముందే వ్యక్తి మృతి.. మృతదేహాన్ని భద్రపరిచిన అధికారులు

ABN , First Publish Date - 2020-07-02T21:27:52+05:30 IST

వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ కరోనా అనుమానితుడు మృతి చెందినట్లు బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అనారోగ్య కారణాలతో ఎంజీఎంలో చేరిన

కరోనా టెస్ట్ రిపోర్టు రాకముందే వ్యక్తి మృతి.. మృతదేహాన్ని భద్రపరిచిన అధికారులు

కరోనా లక్షణాలతో వ్యక్తి మృతి


హన్మకొండ అర్బన్(వరంగల్) : వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ కరోనా అనుమానితుడు మృతి చెందినట్లు బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అనారోగ్య కారణాలతో ఎంజీఎంలో చేరిన శుంభునిపేటకు చెందిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో నమూనాలు సేకరించి కోవిడ్‌ విభాగంలో చేర్చుకోవడం జరిగింది. వార్డులో చికిత్స అందిస్తున్న సమయంలో బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 


వైరాలజీ ల్యాబ్‌ నుంచి రిపోర్టులు అందక ముందే చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందడంతో రిపోర్టులు అందేవరకు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చినట్లయితే మృతదేహాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుందని రిపోర్టు నెగిటివ్‌గా వచ్చినట్టయితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.. 

Updated Date - 2020-07-02T21:27:52+05:30 IST