పెళ్లి వేడుకలో తుపాకీ పేల్చిన వరుడు.. బుల్లెట్ బయటకు వచ్చిందనుకుని కిందకు దించగానే ఊహించని సీన్

ABN , First Publish Date - 2022-06-23T22:01:35+05:30 IST

పెళ్లి వేడుకలో వరుడి ఉత్సాహం ఓ యువకుడి ప్రాణం తీసింది.. ఆనందోత్సాహాల మధ్య వరుడు తుపాకీ కాల్చాడు..

పెళ్లి వేడుకలో తుపాకీ పేల్చిన వరుడు.. బుల్లెట్ బయటకు వచ్చిందనుకుని కిందకు దించగానే ఊహించని సీన్

పెళ్లి వేడుకలో వరుడి ఉత్సాహం ఓ యువకుడి ప్రాణం తీసింది.. ఆనందోత్సాహాల మధ్య వరుడు తుపాకీ కాల్చాడు.. అయితే తుపాకీలో బుల్లెట్ స్టక్ అయిపోయింది.. కిందకు దించిన తర్వాత బయటకు వచ్చి ఓ యువకుడి తలలోకి దూసుకుపోయింది.. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.. దీంతో పోలీసులు ఆ వరుడిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 


స్నేహితుడు మనీష్ వివాహం కోసం ఆర్మీ సైనికుడు అయిన బాబులాల్ యాదవ్ సోన్‌భద్రకు చేరుకున్నాడు. మంగళవారం రోజంతా అతనితో కలిసి సరదాగా గడిపాడు. సాయంత్రం ఊరేగింపులో కూడా పాల్గొన్నాడు. ఆ వివాహ వేడుకలో వరుడు మనీష్ ఆనందోత్సాహాల మధ్య తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో తుపాకీ నుంచి బుల్లెట్ బయటకు రాలేదు. కిందకు దించిన తర్వాత ఒక్కసారిగా పేలింది. ఊరేగింపులో ఉన్న బాబూలాల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో బాబూలాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీష్‌ను బుధవారం అరెస్ట్ చేశారు.  

Updated Date - 2022-06-23T22:01:35+05:30 IST