పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. దివ్యాంగురాలిపై పలుమార్లు బలాత్కారం.. ఆ తరువాత పెద్దలు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-05-10T08:04:31+05:30 IST

పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పిన యువకుడు.. ఒక దివ్యాంగురాలిని గర్భవతిని చేశాడు. విషయం బయట పడకూడదని ఆమెకు ఏదో మందు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. అప్పటికి కూడా అతని మోసం గ్రహించలేకపోయిన యువతిని పెళ్లి మాట చెప్తూ బలాత్కరిస్తూనే వచ్చాడు...

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. దివ్యాంగురాలిపై పలుమార్లు బలాత్కారం.. ఆ తరువాత పెద్దలు ఏం చేశారంటే..

పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పిన యువకుడు.. ఒక దివ్యాంగురాలిని గర్భవతిని చేశాడు. విషయం బయట పడకూడదని ఆమెకు ఏదో మందు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. అప్పటికి కూడా అతని మోసం గ్రహించలేకపోయిన యువతిని పెళ్లి మాట చెప్తూ బలాత్కరిస్తూనే వచ్చాడు. ఈ ఘటన బిహార్‌లోని జమూయీ ప్రాంతంలో వెలుగు చూసింది. ఇందర్ కుమార్ అనే యువకుడి అన్నయ్యకు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది.


వదినకు చెల్లెలు వరుస అయ్యే ఒక దివ్యాంగురాలిపై ఇందర్ కుమార్ కన్ను పడింది. వదినను చూడటానికి వస్తున్నట్లు ఆ ఇంటికి వస్తూ నెమ్మదిగా ఆమెను తన ప్రేమ వలలో పడేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలానికి ఆమె గర్భవతి కావడంతో గర్భస్రావం చేయించాడు. అప్పటికీ నిజం తెలుసుకోలేకపోయిన యువతితో శారీరక సంబంధం కొనసాగిస్తూనే వచ్చాడు. అయితే వాళ్లిద్దరినీ అసభ్యకర రీతిలో చూసిన కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది.

పెద్దలంతా కలిసి వాళ్లిద్దరికీ పెళ్లి చేసింది. అయితే పెళ్లి అయిన రెండో రోజే ఇందర్ కుమార్ ఇంటి నుంచి పరారయ్యాడు. దివ్యాంగురాలి కుటుంబం అతని ఇంటికి వెళ్తే.. ఆ కుటుంబ సభ్యులు అసలు మాట కూడా వినలేదు. దీంతో బాధపడిన ఆ దివ్యాంగురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Read more