అనారోగ్యంతో భార్య మృతి... ఆవేద‌న‌తో వ‌ల‌స‌కూలీ ఆత్మ‌హ‌త్య‌!

ABN , First Publish Date - 2020-05-17T12:29:15+05:30 IST

యూపీలో ఒక వ‌ల‌స కూలీ హృద‌య విదార‌కగాథ వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళితే ఝాన్సీ జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన భ‌గ‌వ‌త్‌(35) తన భార్యతో పాటు నోయిడాలో కూలీగా పనిచేసేవాడు.

అనారోగ్యంతో భార్య మృతి... ఆవేద‌న‌తో వ‌ల‌స‌కూలీ ఆత్మ‌హ‌త్య‌!

ఝాన్సీ: యూపీలో ఒక వ‌ల‌స కూలీ హృద‌య విదార‌కగాథ వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళితే ఝాన్సీ జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన భ‌గ‌వ‌త్‌(35) తన భార్యతో పాటు నోయిడాలో కూలీగా పనిచేసేవాడు. అత‌ని భార్య‌ శివానీ(28)  టీబీ వ్యాధితో బాధపడుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి కోల్పోవ‌డంతో ఏదో విధంగా తన భార్యతో సహా నోయిడా నుండి ఝాన్సీకి చేరుకున్నాడు. అక్క‌డ‌ శివానీ ఆరోగ్యం మ‌రింత‌ క్షీణించింది. ఆమెను తీసుకుని ఝాన్సీ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. చికిత్స సమయంలో ఆమె మ‌ర‌ణించింది.  దీనిని భ‌గ‌వ‌త్ త‌ట్టుకోలేక‌పోయాడు. బాధ‌ను దిగ‌మింగుకుని భార్య మృతదేహాన్ని తీసుకుని గ్రామానికి వ‌చ్చాడు. అయితే భార్య‌కు ద‌హ‌న సంస్కారాలు చేయ‌డానికి ముందే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియగానే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. 

Updated Date - 2020-05-17T12:29:15+05:30 IST