Abn logo
Aug 2 2021 @ 00:45AM

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

శింగనమల, ఆగస్టు1 : మండల కేంద్రమైన శింగనమలకు చెందిన శివశంకర్‌(35) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. శింగనమల పోలీసులు తెలిపిన మేర కు... శింగనమలకు చెందిన మంగళ శివశంకర్‌, నాగవేణికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందిన శివ శంకర్‌ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో విషద్రావకం తాగాడు. గమనించిన కుటుం బసభ్యులు అతడిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందు తూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ వంశీకృష్ణ కేసు నమోదు చేసుకున్నాడు. మృతుడికి భార్య నాగవేణి, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.