Abn logo
Apr 12 2021 @ 23:46PM

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ఇందిరానగర్‌(పోలాకి) : ఇందిరానగర్‌ కాలనీలోని నీలాపు చంద్రకాంత్‌ (46) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చంద్రకాంత్‌కు 2012లో హైమావతితో వివాహమైంది. వీరికి ఇరువురు పిల్లలున్నారు. హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న చంద్రకాంత్‌ 2015లో ఇందిరానగర్‌ కాలనీలో స్థిరనివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం జరిగి, సద్దుమణిగాక రాత్రి 8 గం టల సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. మద్యానికి బానిసైన చంద్రకాంత్‌ రోజూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. భార్య నీలాపు హైమావతి పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం ఎస్‌ఐ చిన్నంనాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement