ఆదోని, జనవరి 28: ఓ వ్యక్తి రైలు కిందపడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ సుబ్బారాయుడు తెలిపిన వివరాల మేరకు బళ్లారికి చెందిన సుభాన్ కుటుంబంతో కలిసి ఆదోనికి బతుకుతెరువు కోసం వచ్చారు. భార్య హజరత్‌బీ, పిల్లలతో క్రాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. కడుపునొప్పి తాళలేక ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.