తనకు చెడ్డపేరు వస్తుందన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-08T21:46:27+05:30 IST

మండల పరిధిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం బహుది జిల్లా బసపాడా గ్రామానికి

తనకు చెడ్డపేరు వస్తుందన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

సారవకోట(శ్రీకాకుళం): మండల పరిధిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.   స్థానిక పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం బహుది జిల్లా బసపాడా గ్రామానికి చెందిన ఆశీష్‌ కనూర్‌ (18) మార్చి నెలలో గుమ్మపాడు సమీపంలో గ్రానైట్‌ పనుల కోసం వచ్చాడు. బసపాడా  గ్రామస్థులు  ఇదివరలో ఇక్కగే గ్రానైట్‌ పనులు చేస్తూ.. కొండ దిగువ నివాసం ఉంటున్నారు. ఈనెల 3న ఉపేంద్ర అనే వ్యక్తికి చెందిన  రెండు ఐదు వందల రూపాయల నోట్లు  ఎవరో తీశారు.  మరుసటి రోజున అదే స్థానంలో చిల్లర డబ్బును ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన ఉపేంద్ర పెద్ద మేస్త్రీ హరిశ్చంద్రకు చెప్పాడు.  


ఈ నెల 6న ఉదయం  డబ్బుల విషయమై  పెద్దమేస్త్రీ  అక్కడ నివాసం ఉంటున్న వారిని  మందలించారు. దుశ్యంత్‌, శ్రీచంద్రతో పాటు మరో ఇద్దరు  ఉన్నారని  గుర్తించారు.   అప్పటికే సమయం కావడంతో సాయంత్రం మాట్లాడుదామని  పనుల్లోకి వెళ్లారు. అయితే..  గురువారం మధ్యాహ్న సమయంలో  ఆశీష్‌కనూర్‌ బాటిల్‌తో నీరు తీసుకుని కొండపైకి వెళ్లాడు. తనపై చెడు మచ్చ వస్తుందన్న మనస్తా పంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన  కార్మికులు సారవకోట పోలీసులకు  సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పాతపట్నం  సీఐ రవిప్రసాద్‌, ఎస్‌ఐ రవికుమార్‌  చేరుకుని విచారణ చేట్టారు. మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-08-08T21:46:27+05:30 IST