Viral Video: మద్యం సేవించి 100 అడుగుల టవర్ ఎక్కిన వ్యక్తి.. అతని డిమాండ్ విని నోరెళ్లబెట్టిన పోలీసులు!

ABN , First Publish Date - 2022-07-24T02:12:38+05:30 IST

భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి చాలా సాధారణం. కొంతమంది తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటారు.

Viral Video: మద్యం సేవించి 100 అడుగుల టవర్ ఎక్కిన వ్యక్తి.. అతని డిమాండ్ విని నోరెళ్లబెట్టిన పోలీసులు!

భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి చాలా సాధారణం. కొంతమంది తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటారు. మరికొంత మంది బంధువులను ఆశ్రయిస్తారు. కొంత మంది మాత్రం చిన్న చిన్న గొడవలను పెద్దవి చేసుకుని ఇబ్బందులు పడుతుంటారు. మహారాష్ట్ర (Maharashtra) కు చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా 100 అడుగుల పొడవున్న మొబైల్ టవర్ (Mobile tower) ఎక్కాడు. అతడిని కిందికి దించేందుకు స్థానికులు, పోలీసులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.


మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గత బుధవారం 100 అడుగుల పొడవున్న మొబైల్ టవర్ ఎక్కాడు. అతడి భార్య కొన్ని రోజుల క్రితం అతడితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు పిలిచినా తిరిగి కాపురానికి రాలేదు. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు మొబైల్ టవర్ ఎక్కాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. 


మొబైల్ టవర్ ఎక్కిన వ్యక్తిని సముదాయించేందుకు ప్రయత్నించారు. అయితే తన భార్య వస్తేనే కిందకి దిగుతానని ఆ వ్యక్తి భీష్మించుకుని కూర్చున్నాడు. అతడిని కిందకు దించడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడ్డారు. అతడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 4 గంటల హైడ్రామా అనంతరం అతను కిందకు దిగి వచ్చాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-07-24T02:12:38+05:30 IST