సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్న యువతీయువకులు.. పెళ్లిచేసుకుందామనుకున్న వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే?..

ABN , First Publish Date - 2022-01-06T09:03:32+05:30 IST

వారిద్దరూ సోషల్ మీడియో ద్వారా ఒకరికిఒకరు పరిచయమయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ యువకుడు ఆమెని పెళ్లిచేసుకుందామని...

సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్న యువతీయువకులు.. పెళ్లిచేసుకుందామనుకున్న వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే?..

వారిద్దరూ సోషల్ మీడియో ద్వారా ఒకరికిఒకరు పరిచయమయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ యువకుడు ఆమెని పెళ్లిచేసుకుందామని చెప్పాడు. అతడి మాటలని నమ్మిన ఆ యవతి అతనికి తన తనువుని సమర్పించుకుంది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అతను సరిగా మాట్లాడేవాడు కాదు. 


పెళ్లి చేసుకుందామని యువతి అడిగితే.. తప్పించుకునేవాడు. ఒకరోజు ఆమె అతడిని నిలదీసే సరికి గొడవ జరిగింది. ఆ యువకుడు ఆమెను చితకబాదాడు. ఆమెను నగ్నంగా ఉన్నప్పుడు చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన లలిత(పేరు మార్చబడినది) అనే యువతికి సోషల్ మీడియా ద్వారా అంకుర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. ఒకరోజు ఇద్దరూ ఒక హోటల్లో కలుసుకున్నారు. లలితను పెళ్లిచేసుకుంటానని నమ్మించి అంకుర్ ఆమెను లోబర్చుకున్నాడు. ఆమెకు తెలియకుండానే ఆమె నగ్నంగా ఉన్న వీడియో రికార్డ్ చేశాడు. 


ఆ తరువాత లలితతో అంకుర్ సరిగా మాట్లాడేవాడు కాదు. దీంతో లలిత ఒకరోజు అంకుర్‌ని నిలదీసింది. తనను పెళ్లిచేసుకోమని అతనిపై ఒత్తిడి చేసింది. కానీ అంకుర్ అమెను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరూ గొడవపడ్డారు. అప్పుడు అంకుర్ లలితకు చితకబాదాడు. ఆమె నగ్నంగా ఉన్న వీడియోని వైరల్ చేస్తానని బెదిరించాడు. ఆ తరువాత లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


పోలీసులు ముందుగా అంకుర్‌ని పిలిచి ప్రశ్నించారు. కానీ అతడు పోలీసులకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసులు అంకుర్ గురించి దర్యాప్తు చేశారు. మరుసటి రోజు అంకుర్‌ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు అంకుర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-01-06T09:03:32+05:30 IST