Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికా వ్యక్తికి.. లక్షలు తెచ్చిపెట్టిన మచ్చల పాము!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన జస్టిన్ కోబిల్కా అనే వ్యక్తికి మచ్చల పాము లక్షలు తెచ్చిపెట్టింది. మచ్చలంటే మాములు మచ్చలు కావవి. స్మైలీ ఫేస్ ఎమోజీస్. ఇలా ఒకే పాముపై మూడు స్మైలీ ఎమోజీలు ఉండడంతో దాన్ని ఓ వ్యక్తి ఏకంగా 6వేల డాలర్లు(రూ. 4.37లక్షలు) పెట్టి కొనుగోలు చేసినట్లు కోబిల్కా తెలిపాడు. ఒక్కపాముకే ఒకేసారి ఇంత భారీ మొత్తం దక్కడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ సందర్భంగా కోబిల్కా మాట్లాడుతూ.. 'గత 19 ఏళ్లుగా పాముల పెంపకం చేస్తున్నాను. ఈ మధ్య బాల్ పైథాన్స్ పెంపకం చేపట్టాను. ఈ క్రమంలో చిన్న తెల్లటి కొండచిలువపై మూడు మచ్చలు ఉండడం గమనించాను. బంగారు వర్ణంతో ఉన్న ఆ మూడు మచ్చలను తీక్షణంగా చూస్తే ఎమోజీస్‌ను పోలి ఉన్నాయి. అది కూడా స్మైలీ ఫేస్ ఎమోజీలు. దాంతో ఆ కొండచిలువను చూసిన ఓ కస్టమర్ అది తనకు కావాలని.. దానికి తాను 6వేల డాలర్లు ఇస్తానని చెప్పాడు. దాంతో ఇంకో మాట మాట్లాడాకుండా దాన్ని అతనికి ఇచ్చేశాను.' అని అన్నాడు. ఇలా ఈ అమెరికన్‌ను మచ్చల పాము రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసిందన్నమాట.   

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement