Advertisement
Advertisement
Abn logo
Advertisement

20 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్న NRI మహిళకు షాకింగ్ అనుభవం.. భర్తే నగ్న ఫొటోలను తీసి..

వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ ప్రేమలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియాలో పరిచయం కావడం, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం, పెళ్లి వరకు వెళ్లడం ప్రస్తుత కాలంలో చాలా వరకు సర్వ సాధారణమైపోయింది. అయితే ఇలా జరిగిన పెళ్లిళ్లలో అనేక జంటలు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోతున్నాయి. ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవడం, లేదా ఇద్దరిలో ఒకరు పెళ్లైన తర్వాత తమ అసలు స్వరూపం బయటపెట్టడంతో వీరి బంధాలు తక్కువ కాలంలోనే తెగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.

 అమెరికాకు చెందిన ఓ ఎన్నారై అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్థానిక యువకుడు పెళ్లైన తర్వాత ఆ అమ్మాయికి నరకం చూపించాడు. ఆమెకు తెలియకుండా నగ్న ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో విసిగిపోయిన అమ్మాయి భర్త దగ్గర నుంచి పారిపోయి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అయినా అతడిలోని పైశాచికత్వం తగ్గలేదు. రూ.25 లక్షలు ఇవ్వాలని, లేకపోతే నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో కొంత మొత్తం ముట్టజెప్పినా.. అతడి పైశాచికత్వం ఆగలేదు. దీంతో చేసేది లేక సదరు ఎన్నారై మహిళ అహ్మదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడి బండారం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ఆమెది అమెరికాలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం. వయసు 42 సంవత్సరాలు. 22 ఏళ్ల క్రితం భారత్‌ నుంచి వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది ఆమె కుటుంబం. 2015లో ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా ఆమెకు మనదేశంలోని అహ్మదాబాద్‌ జిల్లా, ఘోడాసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతి త్వరలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. 2016 అక్టోబర్‌లో భారత్ వచ్చిన ఆమె.. ఇక్కడ అతడిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు అంతా ప్రశాంతంగా సారిగింది. కానీ ఆ తర్వాతే ఆమె జీవితం పూర్తిగా చీకటైపోయింది. 

తనను ఎంతగానో ప్రేమించాడనుకున్న భర్త నరకం చూపించసాగాడు. ఆమెతో పాటు తనను కూడా అమెరికా తీసుకెళ్లాలని బలంవంతం చేయసాగాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఆమెకు తెలియకుండా ఆమె నగ్న ఫోటోలను అతడు తీశాడు. వాటిని చూపించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.5 లక్షలు కట్నం  ఇవ్వాలని లేకపోతే.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో ఆమె అతడిని వదిలి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అప్పటికీ అతడు వదిలిపెట్టలేదు. తనకు డబ్బు కావాలంటూ ఫోన్ చేసి, మెసేజ్‌లు చేస్తు బెదిరించేవాడు. 

ఇటీవల ఓ దొంగతనం కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అమెరికాలో ఉన్న తన భార్యకు ఫోన్ చేసి.. తనకు వెంటనే రూ.25 లక్షలు కావాలని, ఆ మొత్తం ఇస్తే.. విడాకులు ఇస్తానని, లేకపోతే నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె రూ.5లక్షలు నగదు ఇచ్చింది. కానీ రూ.25 లక్షలు కావల్సిందేనని అతడు పట్టుపట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అహ్మదాబాద్ మహిళా తూర్పు పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement