పెళ్లి చేసుకుంటానని మైనర్‌ను నమ్మించి.. లొంగదీసుకొని.. అంతటితో ఆగక..

ABN , First Publish Date - 2021-10-05T12:34:10+05:30 IST

ఢిల్లిలోని మైదాన్ గఢీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల సుప్రియ(పేరు మార్చబడినది)కు అదే ప్రాంతంలో నివసించే కపిల్ అనే యువకుడితో పరిచయం అయింది. కపిల్ ఆ ప్రాంతంలో ఒక మొబైల్ షాపులో పనిచేసేవాడు

పెళ్లి చేసుకుంటానని మైనర్‌ను నమ్మించి.. లొంగదీసుకొని.. అంతటితో ఆగక..

ఢిల్లిలోని మైదాన్ గఢీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల సుప్రియ(పేరు మార్చబడినది)కు అదే ప్రాంతంలో నివసించే కపిల్ అనే యువకుడితో పరిచయం అయింది. కపిల్ ఆ ప్రాంతంలో ఒక మొబైల్ షాపులో పనిచేసేవాడు. సుప్రియ ఆ మొబైల్ షాపులో ఒకసారి వెళ్లడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. సుప్రియను పెళ్లి చేసుకుంటానని చెప్పి కపిల్ ఆమెను లొంగదీసుకున్నాడు. తరుచూ ఆమెతో సెక్స్ చేసేవాడు. 


ఒకరోజు సుప్రియ తన వల్లకాదు పెళ్లి చేసుకుంటావా లేదా అని అతడిని నిలదీసింది. దీంతో కపిల్ అసలు రూపం బయటికచ్చింది. పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని, కానీ తనతో సెక్స్ చేయకపోతే సుప్రియ జీవితం నాశనం చేస్తానని బెదిరించాడు. సుప్రియ అతని మాటలు వినేది లేదని చెప్పేసరికి, కపిల్ తన వద్ద ఉన్న ఒక వీడియో చూపించాడు. అందులో వారిద్దరూ సెక్స్ చేస్తున్నట్టు రికార్డ్ అయి ఉంది. ఇది చూసిన సుప్రియ కంగారు పడింది. తాను చెప్పింది వినకపోతే ఆ వీడియో ఇంటర్నెట్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో అతను చెప్పిన మాటలకు సుప్రియ తలవంచింది.


కానీ కొన్నిరోజుల తరువాత ఇక తనవల్లకాదని పోలీసులకు కపిల్ చేసిన దుర్మార్గం గురించి ఫిర్యాదు చేసింది. సుప్రియ మైనర్ కావడంతో పోలీసులు కపిల్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కపిల్ పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-10-05T12:34:10+05:30 IST