Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల లేని శవాన్ని ఇంట్లో దాచిన వ్యక్తి.. అతను ఎందుకిలా చేశాడంటే..

అసూయ, కోపం మనిషిని వినాశనం వైపుకి తీసుకెళ్తాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక దారుణమైన ఘటన దీనికి ఉదాహరణ. రోజూ పనివిషయంలో గొడవ చేస్తున్నాడని తన తోటి ఉద్యోగిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కానీ అతడి శవాన్ని మాయం చేసేందుకు చేసే ప్రయత్నంలో విఫలమై దొరికపోయాడు. 

వివారాలలోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజియాబాద్ నగరంలో ఒక ఫ్యాక్టరీ ఇద్దరు వ్యక్తులు సందీప్, ప్రమోద్  మెషీన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. తరుచూ మెషీన్ పాడైపోవడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగేది. మెషీన్ దుస్థితికి సందీప్ నిర్లక్ష్యమే కారణమని ప్రమోద్ యాజమాన్యానికి ప్రతీసారి చెప్పేవాడు. దీంతో సందీప్, ప్రమోద్ మధ్య గొడవ మొదలైంది. వారిద్దరూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేవారు. తన మీద ప్రమోద్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో సందీప్ కోపం పెంచుకున్నాడు. 


ప్రమోద్‌ని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సందీప్, ప్రమోద్ ఇద్దరూ ఫ్యాక్టరీ సమీపంలోని కాలనీలోనే నివసించేవారు. ప్రమోద్ తన భార్యతో నివసిస్తుండగా.. సందీప్ ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు సందీప్ మందు పార్టీ అని చెప్పి ప్రమోద్‌ని పిలిచాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదని, ఇక మంచిగా.. స్నేహితులుగా ఉందామని చెప్పి.. ప్రమోద్‌ని బాగా తాగించాడు. మైకం బాగా ఎక్కిన ప్రమోద్ అక్కడే నిద్రపోయాడు. ఆ తరువాత సందీప్ తన వద్దనున్న పెద్ద కత్తితో ప్రమోద్ తల నరికేశాడు. తలలేని శవాన్ని ఒక పెట్టెలో దాచి.. తలని ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న చెత్తకుండీలో పారేశాడు.


మరుసటి రోజు ప్రమోద్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఫ్యాక్టరీ వద్దకు వచ్చి ప్రమోద్ గురించి అడిగింది. అక్కడ ప్రమోద్, సందీప్ ఇద్దరూ ఆ రోజు డ్యూటీకి రాలేదని తెలిసుకొని సందీప్ ఇంటికి వెళ్లింది. అక్కడ సందీప్ తన ఇంటికి తాళం వేసి బయటకు వెళుతుండగా.. ప్రమోద్ భార్య అతడిని తన భర్త గురించి ప్రశ్నించింది. దానికి అతడు సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఆమెకు సందీప్‌పై అనుమానం వచ్చింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత తన కుటుంబ సభ్యులను పిలిపించి సందీప్ ఇంటి తాళం పగలకొట్టి అక్కడ వెతికింది. 


సందీప్ ఇంట్లో వాళ్లకు ఒక తలలేని శవం దొరికింది. అది ప్రమోద్ శవమని అతని భార్య గుర్తించడంతో.. వారంతా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకమునుపే సందీన్ అక్కడకు చేరుకున్నాడు. దీంతో వారంతా అతడిని చితకబాది..కట్టి పడేశారు. ఇంతలో పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి విచారణ చేయగా.. ప్రమోద్ తలను చెత్తకుండీలో పారవేసానని అతడు ఒప్పుకున్నాడు. పోలీసులు సందీప్‌పై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement