Serial Killer: 6 రోజుల్లో నలుగురిని చంపేశాడు.. 19 ఏళ్ల వయసులోనే ఏంటీ దారుణమని నిలదీస్తే.. ఆ కుర్రాడు చెప్పిన మాటలు విని..

ABN , First Publish Date - 2022-09-03T22:14:39+05:30 IST

ఆ యువకుడి వయస్సు 19 సంవత్సరాలు.. పేరు- శివ్ గోండ్ అలియాస్ హల్కు. అతడు ఆరు రోజుల్లో నలుగురు గార్డులను హతమార్చాడు

Serial Killer: 6 రోజుల్లో నలుగురిని చంపేశాడు.. 19 ఏళ్ల వయసులోనే ఏంటీ దారుణమని నిలదీస్తే.. ఆ కుర్రాడు చెప్పిన మాటలు విని..

ఆ యువకుడి వయస్సు 19 సంవత్సరాలు.. పేరు- శివ్ గోండ్ అలియాస్ హల్కు. అతడు ఆరు రోజుల్లో నలుగురు గార్డులను హతమార్చాడు. ఆ ఆరుగురూ రాత్రి సమయంలో షాపింగ్ మాల్స్, భవనాల ముందు నిద్రిస్తుండగా వారిని చంపేశాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు..  శివ్ ఈ వరుస హత్యలు (serial killer) చేయడానికి కారణం- బాగా ఫేమస్ కావాలనే కోరిక.. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటనలు జరిగాయి. 


ఇది కూడా చదవండి..

స్కూల్‌లో దారుణ ఘటన.. ఈ అమ్మాయిల కులం ఏంటో తెలుసా..? వాళ్లు వడ్డించింది తింటున్నారేంటంటూ..


మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సాగర్ జిల్లా కైక్రా గ్రామానికి చెందిన శివ్‌ది చిన్నప్పటి నుంచి నేర పూరిత స్వభావం. ఓ గిరజన కుటుంబానికి చెందిన శివ్ చిన్న వయసులోనే ఓ కిరాణ కొట్టు యజమాని తల పగలగొట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత 13 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి పారిపోయి పుణె చేరుకుని ఓ హోటల్‌లో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడి నుంచి గోవా వెళ్లి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు. రక్షా బంధన్ సమయంలో తిరిగి స్వగ్రామానిక వెళ్లాడు. అప్పట్నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. గత నెల 27వ తేదీ రాత్రి కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న వాచ్‌మెన్ కళ్యాణ్ లోధి (50) తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. 


ఆ తర్వాత చుట్టు పక్కల ప్రాంతాల్లో మరో ఇద్దరు వాచ్‌మెన్‌లను చంపాడు. అక్కడి నుంచి భోపాల్ చేరుకుని మరో వాచ్‌మెన్‌ను చంపాడు. దీంత కలకలం రేగింది. మధ్యప్రదేశ్ హోం మంత్రి కూడా ఈ వరుస హత్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, సాగర్ జిల్లాలోని మోతీనగర్‌లో ఓ గార్డును చంపిన తర్వాత అతడి మొబైల్‌ను శివ్ తీసుకెళ్లాడు. ఆ మొబైల్ లొకేషన్ ఆధారంగా భోపాల్‌లోని లాల్‌ఘటి ప్రాంతంలో శివ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చివరకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ హత్యలన్నింటినీ తానే చేసినట్టు శివ్ నిజం అంగీకరించాడు. ఫేమస్ కావడం కోసమే ఆ హత్యలు చేసినట్టు శివ్ చెప్పడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు శివ్ పోలీసు వాహనంలో వెళుతూ మీడియాకు విజయ చిహ్నాన్ని కూడా చూపించాడు. 

Updated Date - 2022-09-03T22:14:39+05:30 IST