సేహితులకు మందు పార్టీ ఇచ్చిన యువకుడు.. పార్టీలో ఒక్కసారిగా కత్తితో ఆవేశంగా వచ్చి దాడి చేసిన మరో స్నేహితుడు.. అలా ఎందుకు చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-06T08:35:48+05:30 IST

ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటుండగా.. పార్టీ మధ్యలో అతని మరో స్నేహితుడు ఆవేశంగా కత్తి తీసుకొని వచ్చి పార్టీ ఇచ్చిన యువకుడిని చంపేశాడు. ఆ తరువాత శవాన్ని గ్రామ శివార్లలోని ఒక కాలువలో పడేశాడు..

సేహితులకు మందు పార్టీ ఇచ్చిన యువకుడు.. పార్టీలో ఒక్కసారిగా కత్తితో ఆవేశంగా వచ్చి దాడి చేసిన మరో స్నేహితుడు.. అలా ఎందుకు చేశాడంటే..

ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటుండగా.. పార్టీ మధ్యలో అతని మరో స్నేహితుడు ఆవేశంగా కత్తి తీసుకొని వచ్చి పార్టీ ఇచ్చిన యువకుడిని చంపేశాడు. ఆ తరువాత శవాన్ని గ్రామ శివార్లలోని ఒక కాలువలో పడేశాడు. పోలీసులు ఆ గుర్తు తెలియని మృతదేహం గురించి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు తెలిశాయి.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బేమెతారాలో నివసించే దీపేశ్ రాజ్‌పూత్ అనే యువకుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో నివసించే రామ్ సింగ్(40) అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. నెల రోజుల్లో పంట చేతికొచ్చాక తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆరు నెలలు గడిచినా అప్పు తిరిగి చెల్లించలేదు. పైగా ఒకరోజు రామ్ సింగ్ కూతురు(14)తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం రామ్ సింగ్‌కు తెలిసింది. దీంతో అతను ఒక కత్తి తీసుకొని దీపేశ్‌ను చంపేందుకు బయలుదేరాడు.


దీపేశ్ ఆ రోజు ఎక్కడా కనబడలేదు. ఆ రాజు రాత్రి దీపేశ్ తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్నాడని రామ్ సింగ్‌కు తెలిసింది. అంతే.. రామ్ సింగ్ వెంటనే ఆ పార్టీలో దూసుకొని వెళ్లి దీపేశ్‌ మెడపై తన చేతిలో ఉన్న కత్తితో దాడి చేశాడు. దీపేశ్ మెడ నుంచి రక్తం రావడం చూసి.. పార్టీలో మందు తాగే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత రామ్ సింగ్.. దీపేశ్ మృతదేహాన్ని గ్రామ శివార్లలో ఉన్న ఒక కాలువలో పడేశాడు. రెండు రోజుల తరువాత పోలీసులకు కాలువలో ఒక శవం ఉన్నట్లు సమాచారం అందింది. అప్పటికే దీపేశ్ శవం గుర్తుపట్టలేనంతగా చెడిపోయింది.


అయినా పోలీసులు స్టేషన్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల జాబితా చూసి దీపేశ్ కుటుంబ సభ్యలును పిలిపించారు. వారు ఆ మృతదేహం తమ కొడుకుదేనని గుర్తుపట్టారు. దీంతో పోలీసులు దీపేశ్ స్నేహితులను పిలిచి విచారణ చేయగా.. రామ్ సింగ్ గురించి తెలిసింది. పోలీసులు రామ్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అతను హత్య చేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు రామ్ సింగ్‌ను రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2022-04-06T08:35:48+05:30 IST