Bomb Joke: విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి జోక్...ఆపై ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-09-08T14:19:59+05:30 IST

తన బ్యాగులో బాంబు ఉందంటూ(bomb in the bag) ఓ విమాన ప్రయాణికుడు వేసిన జోక్(Cracking a joke) ఆయన కుటుంబానికి శాపంగా...

Bomb Joke: విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి జోక్...ఆపై ఏమైందంటే...

ఇండోర్ (మధ్యప్రదేశ్): తన బ్యాగులో బాంబు ఉందంటూ(bomb in the bag) ఓ విమాన ప్రయాణికుడు వేసిన జోక్(Cracking a joke) ఆయన కుటుంబానికి శాపంగా మారిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్(Indore) నగర విమానాశ్రయంలో తాజాగా జరిగింది. ఓ విమాన ప్రయాణికుడు తన భార్య, కుమార్తెతో కలిసి విమానం ఎక్కేందుకు రాత్రి ఇండోరులోని దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి(Devi Ahilyabai International Airport) వచ్చాడు. విమానాశ్రయం(Indore Airport) ఎంట్రీగేటు వద్ద సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేస్తుండగా తన లగేజీలో బాంబు ఉందంటూ ప్రయాణికుడు జోక్ చేశాడు.


అంతే విమాన ప్రయాణికుడి లగేజీ మొత్తాన్ని విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు(security check) చేశారు.ఈలోగా అతని కుటుంబం ప్రయాణించాల్సి విమానం కాస్తా వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికుడు తాము ఎక్కాల్సిన విమానాన్ని మిస్ అయ్యారు. అనంతరం అతన్ని అనుమానంతో సెక్యూరిటీ అధికారులు ప్రశ్నించారు.అనంతరం బాంబు ఉందంటూ జోక్ వేయడంపై క్షమాపణలు కోరుతూ ప్రయాణికుడి నుంచి క్షమాపణలు చెబుతూ లేఖ రాయించుకున్నారు. విమాన ప్రయాణికుడి లగేజీ బ్యాగులను తనిఖీ చేశాక అందులో బాంబు లేదని తేలిందని, అతని అనుచిత ప్రవర్తన, బాంబు ఉందంటూ జోక్ వేయడంపై క్షమాపణలు కోరుతూ లేఖ రాసి ఇచ్చిన తర్వాత వదిలివేశామని విమానాశ్రయం డైరెక్టర్ రవీంద్రన్ చెప్పారు.


 అంతలో అతని కుటుంబం ప్రయాణించాల్సిన విమానం కాస్తా వెళ్లి పోయిందని డైరెక్టర్ చెప్పారు. రాతపూర్వకంగా క్షమాపణ పత్రం(apologized) రాయించుకున్నాకే విమాన ప్రయాణికుడి కుటుంబాన్ని విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించామని సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(Central Industrial Security Force)  అధికారి సంజయ్ శుక్లా చెప్పారు. విమాన ప్రయాణికుడు బాంబుపై వేసిన జోక్ గురించి పోలీసులకు కూడా సమాచారం అందించామని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-09-08T14:19:59+05:30 IST