ఆత్మహత్యకు శిక్షేంటి?.. పోలీసులను అడిగిన వ్యక్తి.. ఆ తర్వాత

ABN , First Publish Date - 2020-02-03T23:44:47+05:30 IST

ఆత్మహత్యకు ఎటువంటి శిక్ష విధిస్తారు? అంటూ ముంబై పోలీసులను ప్రశ్నించాడో వ్యక్తి.

ఆత్మహత్యకు శిక్షేంటి?.. పోలీసులను అడిగిన వ్యక్తి.. ఆ తర్వాత

ఆత్మహత్యకు ఎటువంటి శిక్ష విధిస్తారు? అంటూ ముంబై పోలీసులను ప్రశ్నించాడో వ్యక్తి. ఎందుకని ప్రశ్నిస్తే.. ‘నేను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడయ్యా. దీనికి భారత్‌లో శిక్షేంటో తెలియట్లేదు. గూగుల్, వికీపీడియాలో కూడా ఈ సమాచారం లేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా’ అంటూ సమాధానమిచ్చాడు. దీనికి వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తి ఫోన్ నెంబర్, అడ్రస్ తీసుకున్నారు. ఫోన్ చేసి అతని మనసు మార్చే ప్రయత్నం చేశారు.

కానీ నీలేష్ వారి మాటలు వినలేదు. దీంతో నేరుగా నీలేష్ ఇంటికెళ్లిన ఓ పోలీసు అధికారి.. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం అతని కుటుంబానికి సమాచారం అందించాడు. ఇంట్లో మనస్పర్థలు, గొడవల వల్ల నీలేష్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మద్యంతాగిన అతను.. ఆ మత్తులోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-02-03T23:44:47+05:30 IST