Salary మాట్లాడేందుకు మా అమ్మను తీసుకురావొచ్చా? టెకీ వైరల్ పోస్ట్‌పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ABN , First Publish Date - 2022-07-10T21:27:19+05:30 IST

ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ మొదలైన వాటిలో సెలెక్ట్ అయిన తర్వాత ఉద్యోగికి, కంపెనీకి మధ్య జరిగే Salary Negotiation చాలా కీలకమైనవి.

Salary మాట్లాడేందుకు మా అమ్మను తీసుకురావొచ్చా? టెకీ వైరల్ పోస్ట్‌పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ మొదలైన వాటిలో సెలెక్ట్ అయిన తర్వాత ఉద్యోగికి, కంపెనీకి మధ్య జరిగే Salary Negotiation చాలా కీలకమైనవి. తక్కువ జీతంతో ఉద్యోగంలో చేరితే ఆ ప్రభావం ఉద్యోగి కెరీర్‌పై పడుతుంది. అందుకే చాలా తెలివిగా, జాగ్రత్తగా సాలరీ ప్యాకేజీ గురించి చర్చించాలని నిపుణులు చెబుతుంటారు. ఎంతగా రిహార్సల్స్ వేసుకున్నా శాలరీ చర్చల విషయంలో కొందరు మొహమాట పడుతుంటారు. 


ఈ నేపథ్యంలో ఇటీవల నితేష్ యాదవ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. `జీతం గురించి చర్చించే సమయంలో మా అమ్మను తీసుకురావొచ్చా? ఆమె ఖచ్చితంగా మంచి డీల్ కుదురుస్తుంద`ని నితీష్ చేసిన పో స్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు లింక్డిన్‌లో ఇప్పటికే 178,245 రియాక్షన్స్, 2,012 కామెంట్స్, 1,779 షేర్స్ వచ్చాయి. కొందరు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నాయి. `అవును.. వారికి గొప్ప నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయ`ని ఒకరు కామెంట్ చేశారు. `ఉచితంగా పచ్చిమిర్చి, కొత్తిమీర అలవెన్స్ కూడా రావొచ్చ`ని మరొకరు కామెంట్ చేశారు. 



Updated Date - 2022-07-10T21:27:19+05:30 IST