దివ్యాంగుడైన మామ‌ను వీపుపై ఎక్కించుకుని...

ABN , First Publish Date - 2020-05-23T17:15:16+05:30 IST

లాక్‌డౌన్‌లో వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టంతో వ‌ల‌స కార్మికులు త‌మ ఇళ్ల‌కు తిరుగుముఖం ప‌ట్టారు. చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో...

దివ్యాంగుడైన మామ‌ను వీపుపై ఎక్కించుకుని...

ఘజియాబాద్: లాక్‌డౌన్‌లో వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టంతో  వ‌ల‌స కార్మికులు త‌మ ఇళ్ల‌కు తిరుగుముఖం ప‌ట్టారు. చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో కాలిన‌డ‌క‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో ప‌లు హృద‌య‌విదార‌క వైనాలు వెలుగు చూస్తున్నాయి. హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో కూలీగా ప‌నిచేసే రాకేశ్ కుమార్ దివ్యాంగుడైన త‌న మామను వీపుపై ఎక్కించుకుని రెండు రోజుల్లో ఘజియాబాద్‌కు తీసుకువచ్చాడు. అక్కడికి చేరుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం వారిని బస్సులో మురద్‌నగర్‌కు పంపించింది. అక్కడ రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ పూర్తి చేశాక‌, వారిని  రైల్వే స్టేషన్‌కు తరలించారు. రైలులో రాకేష్ త‌న‌ మామ ఉమేష్‌తో కలిసి పట్నాకు బయలుదేరాడు. 

Updated Date - 2020-05-23T17:15:16+05:30 IST