Kuwait లో నగ్నంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.. అక్కడి చట్టాల ప్రకారం శిక్ష ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-07T16:58:46+05:30 IST

రద్దీగా ఉన్న రోడ్లపై నగ్నంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని కువైత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kuwait లో నగ్నంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.. అక్కడి చట్టాల ప్రకారం శిక్ష ఏంటంటే..

కువైత్ సిటీ: రద్దీగా ఉన్న రోడ్లపై నగ్నంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని కువైత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒంటిపై నూలుపొగు లేకుండా తిరుగుతూ పాదాచారులు, రోడ్లపైకి వచ్చే వాహనదారులకు అతడు అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం వీడియోలో రికార్డైంది. ఇలా వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. హావల్లి గవర్నరేట్ పరిధిలో నగ్నంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తన ప్రకటలో పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి ఏ దేశ పౌరుడు అనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు. ఇక పోలీసుల విచారణలో ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, దాని తాలూకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. 


ఇదిలాఉంటే.. కువైత్ చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి ఒక ఏడాది జైలు శిక్షతో పాటు వెయ్యి దినార్ల(రూ.2.50లక్షలు) జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండింటీలో ఏదో ఒకటి అమలు చేయడం జరుగుతుంది. ఇక ఇటీవల అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగింది. బీరుట్‌ వీధుల్లో ఓ మహిళ అర్ధనగ్నంగా తిరుగుతూ హల్‌చల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఆ మహిళ పైన కేవలం షర్టు మాత్రమే ధరించి రోడ్లపై తిరగడం వీడియోలో ఉంది. వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన బీరూట్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడబోనని మహిళ చెప్పడంతో ఆమెను విడిచిపెట్టారు.      


Read more