కొవిడ్ నకిలీ ఔషధాల విక్రయం...నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-02T00:18:33+05:30 IST

కొవిడ్ నకిలీ ఔషధాలను విక్రయిస్తున్న నిందితుడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు....

కొవిడ్ నకిలీ ఔషధాల విక్రయం...నిందితుడి అరెస్ట్

 ముంబై : కొవిడ్ నకిలీ ఔషధాలను విక్రయిస్తున్న నిందితుడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ చికిత్సకు అంటూ నకిలీ ఇంజక్షన్లను అజయ్ శ్యాంలాల్ నసా విక్రయిస్తుండగా క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.నకిలీ ఔషధాల విక్రయం వెనుక పెద్ద ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.స్విట్జర్లాండ్ మందులంటూ ఇతర మందులను నింపి విక్రయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై క్రైంబ్రాంచ్ పోలీసు అధికారి నందకుమార్ గోపాలే చెప్పారు. 

Updated Date - 2020-10-02T00:18:33+05:30 IST