మూగ యువతిని వేధించిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-30T11:42:45+05:30 IST

మూగ యువతిని లైంగికంగా వేధించిన కేసులో ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై శీలం రవి సోమవారం తెలిపారు

మూగ యువతిని వేధించిన వ్యక్తి అరెస్టు

చెన్నారావుపేట జూన్‌ 29: మూగ యువతిని లైంగికంగా వేధించిన కేసులో ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై శీలం రవి సోమవారం తెలిపారు. యువతిని  ఉప్పరపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ గునిగంటి నవీన్‌ మధ్యాహ్నం వేళల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో శారీరకంగా లోబర్చుకుని ఆమెపై తరుచూ లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. దీంతో ఆ మూగ యువతి గర్భం దాల్చిందని, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-30T11:42:45+05:30 IST