Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

New York లో భారతీయ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్!

twitter-iconwatsapp-iconfb-icon
New York లో భారతీయ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ నెల 3న విద్వేషపూరిత దాడి జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం బయట భారత సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై ఓ అమెరికన్ విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో భారత కాన్సులేట్ వెంటనే స్పందించింది. ఈ ఘటన తీవ్ర కలవరపాటుకు గురి చేసిందని పేర్కొంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన కాన్సులేట్.. అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన న్యూయార్క్ పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిని మహ్మద్ హస్సనైన్‌గా గుర్తించిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్, న్యూజెర్సీ పోలీస్ డిపార్ట్‌మెంట్ (పీఏపీడీ) ధృవీకరించింది. అతనిపై విద్వేషపూరిత, తీవ్ర వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు పీఏపీడీ వెల్లడించింది.  


ఇదిలాఉంటే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నవజోత్ పాల్ కౌర్ అనే మహిళ జనవరి 4న ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 26 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఎయిర్‌పోర్టు బయట ఘటన సమయంలో ఓ వ్యక్తి చిత్రీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. గత కొంతకాలంగా సిక్కు డ్రైవర్లపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆమె విచారం వ్యక్తం చేశారు. వీడియోలో సిక్కు వ్యక్తి తలపై ధరించిన టర్బన్‌ను మహ్మద్ హస్సనైన్‌ తొలగించడంతో పాటు చేయి చేసుకోవడం ఉంది. ఆ తర్వాత దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా వీడియోలో రికార్డైంది.   


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.