Americaలో నర్సుగా పని చేస్తున్న భార్య.. ఇక్కడ మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త.. అతడికి ఆమె ఎలా బుద్ధి చెప్పిందంటే

ABN , First Publish Date - 2022-04-18T21:33:17+05:30 IST

కుటుంబం కోసం స్వదేశాన్ని వీడి విదేశానికి వెళ్లిన మహిళకు తన భర్త షాకిచ్చాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. భార్యకు తెలియకుండా బ్యాంకులో ఉన్న డబ్బును పెద్ద మొ

Americaలో నర్సుగా పని చేస్తున్న భార్య.. ఇక్కడ మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త.. అతడికి ఆమె ఎలా బుద్ధి చెప్పిందంటే

ఎన్నారై డెస్క్: కుటుంబం కోసం స్వదేశాన్ని వీడి విదేశానికి వెళ్లిన మహిళకు తన భర్త షాకిచ్చాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. భార్యకు తెలియకుండా బ్యాంకులో ఉన్న డబ్బును పెద్ద మొత్తంలో డ్రా చేసి, విలాసాలకు ఖర్చు చేశాడు. అయితే ఈ విషయం తాజాగా భార్యకు తెలిసింది. దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. భర్తతోపాటు అతడి ప్రియురాలికీ బుద్ధి చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కేరళకు చెందిన సిజూ కే జోస్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వివాహానంతరం సిజూ భార్య అమెరికా వెళ్లి, అక్కడ ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సిజూ దారి తప్పాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా భార్య సంపాదనను ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఉపయోగించాడు. భార్యకు తెలియకుండా ఉమ్మడి అకౌంట్లో (Joint Account) నుంచి తన పర్సనల్ అకౌంట్‌కు ఏకంగా రూ.1.20కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అయితే ఈ విషయం తాజాగా భార్యకు తెలిసింది. దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. భర్త సిజూతోపాటు అతడి ప్రియురాలిపై కేసు నమోదు చేసింది. ఈ విషయం తెలిసి సిజూ తన ప్రియురాలితో కలిసి దేశం విడేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 




Updated Date - 2022-04-18T21:33:17+05:30 IST