తనను ప్రేమించలేదని.. ఇంట్లో దూరి యువతిపై యాసిడ్ దాడి

ABN , First Publish Date - 2022-05-26T11:12:40+05:30 IST

తను ఎంత ప్రయత్నించినా ప్రేమించడం లేదని ఒక యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి ఇంట్లో ఉండగా బలవంతంగా ఆ ఇంట్లో చొరబడి యువతి గదిలోకి వెళ్లిమరీ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వెలుగు చూసింది. స్థానికంగా నివసించే 19 ఏళ్ల యువతిని ఒక యువకుడు వెంట పడి ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుడా ఎవాయిడ్ చేస్తూ వచ్చింది...

తనను ప్రేమించలేదని.. ఇంట్లో దూరి యువతిపై యాసిడ్ దాడి

తను ఎంత ప్రయత్నించినా ప్రేమించడం లేదని ఒక యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి ఇంట్లో ఉండగా బలవంతంగా ఆ ఇంట్లో చొరబడి యువతి గదిలోకి వెళ్లిమరీ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వెలుగు చూసింది. స్థానికంగా నివసించే 19 ఏళ్ల యువతిని ఒక యువకుడు వెంట పడి ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుడా ఎవాయిడ్ చేస్తూ వచ్చింది. దాంతో కోపం వచ్చిన యువకుడు.. ఆమె ఇంట్లో చొరబడి యువతిపై యాసిడ్ దాడి చేసి పారిపోయాడు. 


యువతి పెట్టిన కేకలతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు నొప్పితో విలవిల్లాడుతున్న యువతిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ఆమెను గోరఖ్‌పూర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దాంతో కుటుంబ సభ్యులంతా కలిసి బాధితురాలిని అక్కడకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. 


కానీ యాసిడ్ దాడి చేసిన అనంతరం ఆ యువకుడు ఇల్లు వదిలి పరారయ్యాడు. దాంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువతి మొఖం, శరీరం తీవ్రంగా గాయపడ్డాయని చెప్పిన అధికారులు.. ఆమె వాంగ్మూలం తీసుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యమయ్యేలా లేదని అన్నారు.

Updated Date - 2022-05-26T11:12:40+05:30 IST