పద్నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని నరికి చంపారు బాలిక తండ్రి, మేనమామ. ఈ ఘటన మధ్య ప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సక్తాపూర్ గ్రామానికి చెందిన త్రిలోక్చంద్ అనే 55 ఏళ్ల వ్యక్తి, అదే గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న బాలిక తండ్రి, మేనమామ నిందితుడిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత శనివారం త్రిలోక్చంద్ను బైక్పై ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న అంజాల్ నదీ తీరానికి తీసుకెళ్లారు. అక్కడ త్రిలోక్చంద్ను నరికిచంపారు. మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. ఆదివారం శరీర భాగాలు నదిలో తేలడాన్ని స్థానికులు గమనించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.