కుక్కపై వ్యక్తి పైశాచికత్వం.. సీసీటీవీ పుటేజీలో రికార్డ్

ABN , First Publish Date - 2021-01-16T01:19:25+05:30 IST

బరేలా పట్టణానికి 54 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తమ సమీపంలోని ఆడ కుక్కపై తరుచుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ పుటేజీ బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..

కుక్కపై వ్యక్తి పైశాచికత్వం.. సీసీటీవీ పుటేజీలో రికార్డ్

భోపాల్: మనుషులపైనే కాదు జంతువులపై కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బరేలా పట్టణంలో వెలుగు చూసిన ఘటన ఇలాంటిదే. మనిషి పైశాచికత్వానికి ఇదో పరాకాష్ట. ఒక ఆడ కుక్కపై ఓ వ్యక్తి వరుసగా లైంగిక హింసకు పాల్పడ్డాడు. ఈ దారుణం సీసీటీవీ పుటేజీలో రికార్డు కావడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిందితుడిపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


బరేలా పట్టణానికి 54 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తమ సమీపంలోని ఆడ కుక్కపై తరుచుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ పుటేజీ బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జంతు ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై సెక్షన్ 377 (అసాధారణ లైంగిక చర్య), జంతువులపై క్రూర చర్యల నివారణ చట్టం కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ముందు నేరాన్ని ఒప్పుకున్న అనంతరం కస్టడీకి పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-16T01:19:25+05:30 IST