Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 08 Jan 2022 20:52:44 IST

క్లాస్‌మేట్స్‌తో మమ్ముట్టి .. వైరల్‌గా మారిన పిక్.. స్పెషల్ ఏంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon
క్లాస్‌మేట్స్‌తో మమ్ముట్టి .. వైరల్‌గా మారిన పిక్.. స్పెషల్ ఏంటంటే..

మలయాళంతో పాటు, తెలుగు వారికి సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. ‘‘ యాత్ర ’’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తాజాగా మమ్ముట్టి ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుటున్నారు.


ఇంతకి ఆ ఫొటోలో అంతగా ఏముందంటే..

కొందరు వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతో ఎనర్జీతో ఉంటారు. అలాంటి వారిని చూసే ‘వయసు శరీరానికే కానీ, మనసుకు కాదు’ అనే నానుడి పుట్టింది. అయితే దీనికి రివర్స్‌గా ఉంటారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆయన ప్రస్తుతం ఏడు పదుల వయసుకు దగ్గరలో ఉన్నారు. అయినా సరే ఆయన ఇంకా 40 ప్లస్ ఏజ్‌లో ఉన్నట్టే కనిపిస్తారు. ఆయన్ను చూస్తుంటే..  ‘వయసు తన మనసుకే కానీ తన శరీరానికి కాదు’ అని ఆ నానుడిని మార్చుకోవాలని అనిపిస్తుంది. అది నిజమేనని ఇటీవల ఆయన బ్యాచ్ మేట్స్‌తో తీయించుకున్న రీయూనియన్ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ఈ ఫోటోలో తనతో కలుపుకొని 16 మెంబర్స్ ఉన్నారు. వారంతా కేరళలోని ఎర్నాకుళంలో 1972లో ఎల్‌ఎల్‌బీ చదువుకున్న మమ్ముట్టి బ్యాచ్ మేట్స్. అందరూ ఇప్పుడు వయసు మీద పడి.. తెల్లగెడ్డాలతో ముడతలు పడిన శరీరంతో ఉన్నారు. వారిలో మమ్ముట్టి ఒకరే స్టిల్ యంగ్ అనిపించుకుంటున్నారు. పూల చొక్కా, గ్లాక్సో పంచెలో మమ్ముట్టి పూలరంగడిలా వెలిగిపోతున్నారు. హీరో అయిన దగ్గర నుంచి  చక్కటి డైట్ పాటిస్తూ తనలో వృద్ధాప్య ఛాయలు ఏమాత్రం రానీయకుండా.. తన బాడీని మెయిన్ టెయిన్ చేస్తూ వస్తున్నారు మమ్ముట్టి.


మమ్ముట్టి తన బ్యాచ్‌మేట్స్‌ను మహారాజా కాలేజీలో కలిశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మమ్ముట్టి ఛారిటీ వ్యవహారాలను చూసుకునే రాబర్ట్ జిన్స్ ఆ ఫొటోను తన ఫేస్‌బుక్ పేజిలో షేర్ చేశారు. ఆ ఫొటోను హీరో అభిమానులందరు షేర్ చేసుకుంటున్నారు. నెటిజన్లు అందరు ఆ ఫొటో కింద కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన పొలిటికల్ డ్రామా ‘‘ వన్ ’’. సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. మురళీ గోపి, జోజు జార్జ్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement