మలయాళ మెగాస్టార్ మమ్మట్టి తాజా చిత్రం ‘పుళు’ (పురుగు). రతీన పీటీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యస్.జార్జ్ నిర్మిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. పార్వతీ తిరువోత్తు కీలక పాత్రలో నటిస్తుండగా, ఆత్మీయ రాజన్, మళవికా మీనన్, నెడుముడి వేణు, వాసుదేవ్ సజీష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలి. అయితే పాండమిక్ పరిస్థితుల దృష్ట్యా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ చేస్తున్నారు.
త్వరలో సోనీ లివ్ ఓటీటీలో చిత్రం డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. విడుదల తేదీ ఇంకా అనౌన్స్ కాలేదు. మమ్ముట్టి పోలీస్ గా నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. అందుకే ‘పుళు’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాస్టియర్ విమెన్స్ డే రోజున అనౌన్స్ అయిన ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర గ్రే షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మమ్ముట్టికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.