Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 14:56:51 IST

Mammootty : ‘క్రిస్టోఫర్’ గా సరికొత్త అవతారం

twitter-iconwatsapp-iconfb-icon

ఈ ఏడాది ‘భీష్మపర్వం, సిబిఐ 5 : ది బ్రైన్, పుళు’ చిత్రాలతో మాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). అఖిల్ (Akhil) హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ (Agent) లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన.. ఈ ఏడాది ‘నన్‌పగల్ నేరత్తు మయక్కం, రోసాఖ్, కడుగన్నవ ఒరు యాత్ర, బిలాల్’ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యలో ఆయన చిత్రాల లిస్ట్ లోకి మరో చిత్రం కూడా వచ్చి చేరింది. టైటిల్ ‘క్రిస్టోఫర్’ (Christopher). మేన్ ఆఫ్ యాక్షన్ (Man Of The Action) ట్యాగ్ లైన్. ఇటీవల మోహన్ లాల్ (Mohanlal) హీరోగా ‘ఆరాట్టు’ (Aarattu) అనే మూవీ తెరకెక్కించిన దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ (B. Unni Krishnan) దీనికి దర్శకుడు. ఆర్డీ ఇల్యూమినేషన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉన్నికృష్ణన్ దీనికి నిర్మిస్తున్నారు. క్రిష్టాఫర్ టైటిల్ పోస్టర్  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్ పట్టుకొని వెనుక నుంచి రివీలైన మమ్ముట్టి లుక్ ఆకట్టుకుంటోంది. 


అమలాపాల్, స్నేహ, ఐశ్వర్యా లక్ష్మి, వినయ్ రాయ్, షైన్ టామ్ చాకో, దిలీష్ పోత్తన్, జిను జోసెఫ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  జెస్టిన్ వర్గీస్ (Justin Verghese) సంగీతం అందిస్తున్నారు. మమ్ముట్టి ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మలయాళంలో థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో ఎప్పటికప్పుడు ప్రత్మేకత చాటుకునే ఉన్నికృష్ణన్ .. మరో ఆసక్తికరమైన థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.  గత నెల్లో అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించారు. అతి త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. మరి ‘క్రిస్టోఫర్’ గా మమ్ముట్టి ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement