బార్‌, బెంచ్‌ సహకరించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-01T19:15:58+05:30 IST

న్యాయవాదుల బార్‌ అసోసియేషన్‌, బెంచ్‌లు పరస్పర సహకారంతో కక్షిదారుల కు న్యాయసేవలందించాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ బి. మౌర్యతేజ్‌ అన్నారు. మంగళవారం

బార్‌, బెంచ్‌ సహకరించుకోవాలి

                    - ప్రథమశ్రేణి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మౌర్య తేజ్‌


మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): న్యాయవాదుల బార్‌ అసోసియేషన్‌, బెంచ్‌లు పరస్పర సహకారంతో కక్షిదారుల కు న్యాయసేవలందించాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ బి. మౌర్యతేజ్‌ అన్నారు. మంగళవారం మణుగూరు మేజిస్ట్రేట్‌గా హైదరాబాద్‌కు చెందిన మౌర్యతేజ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుర్మ విజయరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. న్యాయవాదుల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. ప్రజలకు చట్టాలపై అవగాహన పెంపొందించాలని, అందుకు నిర్వహించే న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించాలన్నారు. బాధితులకు న్యాయం చేసే క్రమంలో సంసాదకే ప్రాధాన్యం ఇవ్వకుడా, ప్రతిఒక్కరికి న్యాయ మందించేదుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సెక్రటరీ రామ్మోహన చారీ, సభ్యులు రామకోటయ్య, సరస్వతి, శైలజ, కందిమళ్ల నర్సింహా రావు, నగేష్‌కుమార్‌, అశోక్‌, మేదమెట్ల శ్రీనివాసరావు, సోశం భాస్కర్‌, కవిత, సంద్య, సావిత్రి, సర్వేశ్వరరావు, చొక్కయ్య, చిర్ర రవి, రవీంద్ర ప్రసాద్‌, మధు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T19:15:58+05:30 IST