mamatha Banerjee : వ్యాక్సిన్ డోసులు పెంచండి.. లేదంటే దుర్గతే

ABN , First Publish Date - 2021-08-05T22:32:10+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరాను పెంచకపోతే

mamatha Banerjee : వ్యాక్సిన్ డోసులు పెంచండి.. లేదంటే దుర్గతే

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరాను పెంచకపోతే... రానూ రానూ కోవిడ్ పరిస్థితి మరింత భయానకరంగా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. బెంగాల్‌లో జనాభా ఎక్కువ శాతం ఉన్నా, వ్యా్క్సిన్ డోసులు మాత్రం తక్కువ మోతాదులోనే అందుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తమ రాష్ట్రానికి అత్యధిక డోసులు పంపాలని, దాదాపు 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు బెంగాల్‌కు అవసరమని మమత లేఖలో ప్రస్తావించారు. ‘‘గుజరాత్, యూపీ, కర్నాటక సరైన మోతాదులో డోసులు అందాయి. ప్రజల మధ్య వివక్షకు తావు లేదు. జనాభాకు అనుగుణంగా తమకు డోసులు అందడం లేదు. రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని, వివక్షను చూపవద్దని ప్రధానిని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని మమత పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-05T22:32:10+05:30 IST