మమత నాటకాలాడుతున్నారు: దాడి ఘటనపై కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-03-11T02:53:23+05:30 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

మమత నాటకాలాడుతున్నారు: దాడి ఘటనపై కాంగ్రెస్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సానుభూతి పొందడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని మమత చూస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధరి చెప్పారు. ముఖ్యమంత్రి మమత వద్దే హోం మంత్రిత్వ శాఖ కూడా ఉందని, పోలీసులు లేరంటే ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.  


అంతకు ముందు నందిగ్రామ్‌లో కారు దిగే క్రమంలో డోర్ తీస్తుండగా తనపై నలుగురైదుగురు దాడి చేసినట్టు మమత ఆరోపించారు. తనకు గాయం తగిలిందని మీడియా ప్రతినిధులకు చెప్పారు. దాడి కుట్రేనని, తన వెనుక సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ లేరని చెప్పారు. కనీసం ఒక్క పోలీసు కూడా అక్కడ లేరని, నలుగురైదుగురు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అందరూ చూస్తుండగా దురుసుగా వ్యవహరించారని మమత చెప్పారు. ఘటనకు ముందు, మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో నేడు నామినేషన్ దాఖలు చేశారు.


తనపై దాడి జరిగిందంటూ మమత నాటాకాలాడుతున్నారని బెంగాల్ బీజేపీ కూడా ఆరోపించింది. 

Updated Date - 2021-03-11T02:53:23+05:30 IST