మమత వర్సెస్ సువేందు.. ముచ్చెమటలు పట్టిస్తున్న నందిగ్రామ్..

ABN , First Publish Date - 2021-05-02T17:38:46+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఆధిక్యం...

మమత వర్సెస్ సువేందు.. ముచ్చెమటలు పట్టిస్తున్న నందిగ్రామ్..

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఆధిక్యం దిశగా కొన‌సాగుతోంది. తొలి రౌండ్ నుంచే మమత సార‌ధ్యంలోని తృణముల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో టీఎంసీ తొలుత 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా,  54 స్థానాల్లో బీజేపీ ముందంజ‌లో ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆస‌క్తిక‌రంగా మారిన నియోజకవర్గం నందిగ్రామ్‌లో తొలుత సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. అయితే అంత‌లోనే మమత ఆధిక్యం కనబర్చారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేయడంతో ఆస‌క్తి నెల‌కొంది. అలాగే సువేందు అధికారి... ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి తనపై గెలవాలని మమతకు సవాల్ విసిరారు.


ఈ నేప‌ధ్యంలో నంద్రిగామ్ ఎన్నిక‌ల ఫలితంపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. నందిగ్రామ్ నుండి బీజేపీ త‌ర‌పున పోటీకి దిగిన సువేందు అధికారి హ‌వా కొన‌సాగుతుండ‌గా, మమతా బెనర్జీ 8,000 ఓట్ల వెనుకబడి ఉన్నారు. త‌రువాత మమతా బెనర్జీ, సువేందు అధికారి మ‌ధ్య హోరాహోరీ న‌డుస్తోంది.  మూడో మూడో రౌండ్ తర్వాత కూడా మమతా సువేందు అధికారి క‌న్నా వెనుకబడి ఉన్నారు. ప్ర‌స్తుతం సువేందు అధికారికి 34430 ఓట్లు రాగా, మ‌మ‌తా బెన‌ర్జీకి 30655 ఓట్లు పోల‌య్యాయి. దీంతో  ఫ‌లితం ఆస‌క్తిక‌రంగా మారింది. 

Updated Date - 2021-05-02T17:38:46+05:30 IST