కోవిడ్ అదుపులో ఉంది, ఉపఎన్నికలు జరపండి: మమత

ABN , First Publish Date - 2021-08-24T01:35:11+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో ఉప ఎన్నికలు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌కు..

కోవిడ్ అదుపులో ఉంది, ఉపఎన్నికలు జరపండి: మమత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉప ఎన్నికలు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. ప్రజలకు ఓటు వేసే హక్కు, అసెంబ్లీకి ఎన్నికయ్యే హక్కు ఉందని, ప్రజల ప్రజాస్వామిక హక్కులను నియంత్రించలేమని, ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా ప్రకటించాలని అన్నారు.


పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అధికార బులిటెన్ ప్రకారం, పశ్చిమబెంగాల్‌లో ఆదివారంనాడు 561 కోవిడ్ కొత్త కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 686 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.20కు పెరిగింది. పాజిటివిటీ రేటు 1.53గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,461 యాక్టివ్ కేసులు ఉండగా, 15,15,161 మంది పేషెంట్లు ఇంతవరకూ కోలుకున్నారని అధికారిక బులిటెన్ తెలిపింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇంతకుముందు ఆగస్టు 30 వరకూ కోవిడ్ ఆంక్షలను పొడిగించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి బాగా అదుపులోకి వచ్చిందని, అయితే థర్డ్ వేవ్ ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉన్నందున స్థానిక రైళ్లు అనుమతించడం లేదని మమతా బెనర్జీ తెలిపారు.

Updated Date - 2021-08-24T01:35:11+05:30 IST