Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరలోనే టాలీవుడ్‌ రీ ఎంట్రీ

మమతా మోహన్‌దాస్‌ గాయనిగా, హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. దాదాపు పదేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు దూరమైన మమత త్వరలోనే ఓ అనువాద చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘లాల్‌భాగ్‌’ అనే  మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో కూడా విడుదలవుతోన్న ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ మురళీ పద్మనాభన్‌ దర్శకుడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె ఈ చిత్రంలో మమత ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘రాఖీ’ టైటిల్‌ సాంగ్‌, చిరంజీవి నటించిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లో స్పెషల్‌ సాంగ్‌తో మమత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సరసన ‘యమదొంగ’, వెంకటేష్‌తో ‘చింతకాయల రవి’, నాగార్జునతో ‘కేడీ’ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె కేన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలో సినిమాలకు దూరమయ్యారు. విశాల్‌, ఆర్య నటిస్తున్న తమిళ చిత్రం ‘ఎనిమీ’లో ఆమె కీలకపాత్రలో నటిస్తున్నారు. 


Advertisement
Advertisement