Abn logo
Sep 22 2021 @ 19:30PM

మోదీ, షాలకు ఆ అవకాశం ఇవ్వం: మమతా బెనర్జీ

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని తాలిబన్ వైపుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారికి అలాంటి అవకాశం ఎంతమాత్రం ఇవ్వబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశాన్ని విభజించాలనే ఆలోచనలు చెల్లవని, దేశ ఐక్యత చెదిరిపోదని బుధవారం రాష్ట్రంలోని భవానీపూర్‌లో నిర్వహించిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ అన్నారు.


‘‘భారతీయ జనతా పార్టీ మోసపూరిత పార్టీ. మన రాష్ట్రంలో దుర్గా పూజకు, లక్ష్మీ పూజకు అనుమతి లేదని వాళ్లు అబద్ధాలు చెప్తున్నారు. గాంధీజీ, నేతాజీ, వివేకానంద, సర్దాప్ పటేల్, గురు నానక్, గౌతమ బుద్ధ, జైనులు ఈ దేశ ఐక్యతకు ఎంతో చేశారు. ఈ దేశంలో అందరూ కలిసి మెలిసే ఉంటారు. కానీ నరేంద్రమోదీ, అమిత్ షా ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. ఈ దేశాన్ని తాలిబన్ చేయాలనుకుంటున్నారు. వారికి అలాంటి అవకాశం ఇవ్వం. దేశాన్ని తాలిబన్ కానివ్వం’’ అని మమతా బెనర్జీ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption