మోదీ రాజీనామా చేయాలి: మమత

ABN , First Publish Date - 2021-04-19T21:03:36+05:30 IST

కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రజారోగ్యం నిమిత్తం తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు. అనంతరం కోల్‌కతాలో మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీ నిర్వహించబోరని

మోదీ రాజీనామా చేయాలి: మమత

కోల్‌కతా: దేశంలో కోవిడ్ కేసులు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీనికి పూర్తి బాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోదీదేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అంతే కాకుండా దీనికి బాధ్యత వహిస్తూ మోదీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ ‘‘కోవిడ్ కేసులు ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం మోదీనే. ఒక ప్లాన్ లేదు, పరిపాలనా సామర్థ్యం లేదు. పూర్తిగా అసమర్థత. కోవిడ్‌ను అరికట్టేందుకు ఆయన ఏం చేయలేదు, ఇతరుల్ని ఏం చేయనివ్వలేదు’’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.


కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రజారోగ్యం నిమిత్తం తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు. అనంతరం కోల్‌కతాలో మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీ నిర్వహించబోరని టీఎంసీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ప్రకటించారు. కోల్‌కతా మినహా ఇతర జిల్లాల్లో 30 నిమిషాలకు మించకుండా ర్యాలీలు నిర్వహించాలని మమత నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-04-19T21:03:36+05:30 IST