12,435 ఓట్ల ఆధిక్యంలో మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2021-10-03T16:58:26+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల వరకూ ..

12,435 ఓట్ల ఆధిక్యంలో మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్‌పై 12,435 ఓట్ల అధిక్యంతో దూసుకుపోతున్నారు. సీపీఎం తన అభ్యర్థిగా శ్రీజిబ్ బిస్వాస్‌ను బరిలోకి దింపగా, కాంగ్రెస్ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దూరంగా ఉంది. కాగా, భవానీపూర్‌తో పాటు జంగీపూర్, సంసేర్‌గంజ్‌లోనూ కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా, భవానీపూర్‌లోని షకావత్ మెమోరియల్ గరల్స్ హైస్కలులోని మూడంచెల భద్రతా ఏర్పాట్లతో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, 24 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద 8 సీసీటీవీ  కెమెరాలు ఏర్పాటు చేశారు. 21 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - 2021-10-03T16:58:26+05:30 IST